Friday, 6 November 2015

Tripura Movie Review


ఓ పల్లెటూరిలో తన జీవితాన్ని ఆనందంగా గడిపే అమ్మాయి త్రిపుర(స్వాతి). త్రిపురకు కలలో వచ్చిన సంఘటనలన్నీ కూడా నిజజీవితంలో జరుగుతుండటంతో ఈ అమ్మడిని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు. దీంతో త్రిపుర తండ్రి తన కూతురు గురించి దిగులుపడుతూ సిటీకి తీసుకెళ్లి ఓ డాక్టర్ కు చూపించాలని.. త్రిపురను సిటీకి తీసుకెళతాడు. ఇక తనకు కాబోయే ఎలా వుండాలో అంటూ ఊహించుకుంటూ కాలం గడిపే డాక్టర్ నవీన్ చంద్ర. అలాంటి నవీన్ కు తన ఊహల్లో కనిపించే అమ్మాయిలాగే వున్న త్రిపురను చూసి ఇష్టపడతాడు. ఒకరంటే ఒకరు ఇష్టపడటంతో త్రిపురను పెద్దల సమక్షంలో పెళ్లిచేసుకొని, సిటీకి తీసుకొస్తాడు. సిటీకి వచ్చి ఒక అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ అద్దెకు తీసుకొని కొత్త కాపురం మొదలుపెడతారు. ఆ ఫ్లాట్ లో దెయ్యం వుందని తెలిసిన తర్వాత వారు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు? ఆ ఇబ్బందులు ఎలా వచ్చాయి? ఆ తర్వాత త్రిపుర ఏం జరిగింది? అనే ఆసక్తికరమైన అంశాలను వెండితెరపై చూస్తేనే బాగుంటుంది.

నవీన్ చంద్ర, స్వాతి జంటగా నటించిన తాజా చిత్రం ‘త్రిపుర’. ‘గీతాంజలి’ వంటి హర్రర్ చిత్రాన్ని తీసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు రాజ కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జె.రామాంజనేయులు సమర్పణలో క్రేజీ మీడియా పతాకంపై ఎ. చినబాబు, ఎం. రాజశేఖర్ నిర్మించారు. కమ్రాన్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. బ్యూటీఫుల్ కామెడీ, హర్రర్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రానికి కోనవెంకట్, శ్రీనివాస్ వెలిగొండ అందించిన స్ర్కీన్ ప్లే అందించారు. ఈ చిత్రం నేడు (నవంబర్ 6) ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా వుందో ఒకసారి చూద్దామా!

ప్లస్ పాయింట్స్:
ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ స్వాతి. ఇప్పటివరకు క్యూట్ క్యూట్ లవ్లీ పాత్రలలో నటించింది కానీ ఇందులో స్వాతి చాలా మెచ్యుర్డ్ పాత్రలో నటించింది. అమాయకమైన పల్లెటూరి అమ్మాయిగా, ఓ భార్యగా, భయపెట్టే త్రిపుర పాత్రలలో అద్భుతంగా నటించింది. చీరలో స్వాతి చాలా చక్కగా కనిపించింది. నటన పరంగా చాలా పరిణితి చెందింది. స్వాతి చెప్పిన డైలాగ్స్ కూడా చాలా క్యూట్ గా వున్నాయి. కొన్ని కొన్ని సన్నివేశాలలో స్వాతి నటన సూపర్బ్. త్రిపుర పాత్రలో స్వాతి పూర్తిగా ఒదిగిపోయింది. ఇక నవీన్ చంద్ర తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు. స్వాతి-నవీన్ చంద్రల మధ్య వచ్చే క్యూట్ క్యూట్ సీన్స్ బాగున్నాయి. వీరిద్దరి కెమిస్ట్రీ సినిమాకు బాగా వర్కౌట్ అయ్యింది. ఇక సప్తగిరి, షకలక శంకర్ ల కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది. ఇక మిగతా నటీనటులు వారి వారి పాత్రల మేరకు పర్వాలేదనిపించారు.

‘త్రిపుర’ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. కామెడీ, హర్రర్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకులను అలరిస్తుంది. సెకండ్ హాఫ్ పర్వాలేదనిపించే విధంగా వుంది. స్ర్కీన్ ప్లే చాలా బాగుంది. ‘గీతాంజలి’ చూడని ప్రేక్షకులకు ‘త్రిపుర’ చాలా బాగా నచ్చుతుంది.

మైనస్ పాయింట్స్:
‘త్రిపుర’ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ కథ. ‘త్రిపుర’ సినిమా చూస్తున్నంత సేపు కూడా ‘గీతాంజలి’ వలే వుంది అనే భావన కలుగుతోంది. కథలో కొత్తదనం ఏం లేకపోయిన కనీసం స్ర్కీన్ ప్లే విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుని వుంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్ ఎంత బాగుందో సెకండ్ హాఫ్ అంతగా నిరాశపరిచింది. ఫస్ట్ హాఫ్ మీదనే పూర్తిగా దృష్టి సారించి, సెకండ్ హాఫ్ ను ఏదో మూస ధోరణిలో తీసుకెళ్లాలని భావించినట్లుగా కనిపిస్తోంది. అదే పాత కామెడీ, హర్రర్ సన్నివేశాలు సినిమాకు కాస్త మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ‘గీతాంజలి’ సినిమాను దృష్టిలో పెట్టుకొని వెళ్లని ‘త్రిపుర’ పర్వాలేదనిపిస్తుంది.

సాంకేతికవర్గ పనితీరు:

‘త్రిపుర’ సినిమాకు రవికుమార్ సానా అందించిన ఫోటోగ్రఫి చాలా బాగుంది. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. హర్రర్, థ్రిల్లింగ్ సన్నివేశాలను చాలా చక్కగా చూపించారు. విజువల్స్ పరంగా బ్యూటీఫుల్ గా చిత్రీకరించారు. సంగీతం అస్సలు బాగోలేదు. హర్రర్, థ్రిల్లర్ చిత్రాలకు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇంపర్టెన్స్ కానీ ఈ సినిమాలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అంతగా ఆకట్టుకోలేదు. ఇక ఎడిటింగ్ విషయంలో మరింత కేర్ తీసుకొని వుంటే బాగుండేది. సెకండ్ హాఫ్ లో మరింత జాగ్రత్తగా ఎడిటింగ్ చేసి వుంటే బాగుండేది. డైలాగ్స్ పర్వాలేదు. కథలో ఎలాంటి కొత్తదనం లేకపోయినప్పటికీ స్ర్కీన్ ప్లే తో నడిపించాలని దర్శకుడు రాజకిరణ్ ప్రయత్నిస్తున్నట్లుగా కనిపించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా:
త్రిపుర: సేమ్ గీతాంజలి

Source: http://www.teluguwishesh.com/cinema-movies-films/200-movie-film-reviews/69862-tripura-movie-review.html